సంస్కృతి–సంప్రదాయాలకు ప్రతీక తీజ్ ఉత్సవాలు 🌾
జన్నారం ప్రతినిధి: అర్జున్ సమాచారం సెప్టెంబర్ 6:
జన్నారం మండల కేంద్రంలో జరిగిన తీజ్ ఉత్సవాల్లో బంజారా సోదర సోదరీమణులతో కలిసి పాల్గొన్న భూక్యా జాన్సన్ నాయక్ గారు
బంజారా సమాజం అత్యంత భక్తిశ్రద్ధలతో, సంప్రదాయబద్ధంగా జరుపుకునే తీజ్ ఉత్సవాలకు ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ గారు హాజరయ్యారు.
ఈ సందర్భంగా బంజారా సోదర సోదరీమణులతో కలిసి సంప్రదాయ పద్ధతిలో తీజ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీజ్ పాటలు, నృత్యాలు మరియు బంజారా ఆచార సంప్రదాయాల్లో భాగస్వాములయ్యారు.
తీజ్ పండుగ బంజారా ఆడబిడ్డల భక్తి, విశ్వాసం, కుటుంబ సుఖసంతోషాలకు ప్రతీక. బంజారా సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని జాన్సన్ నాయక్ గారు ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా బంజారా కుటుంబాలందరికీ తీజ్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, ఐశ్వర్యం, పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని కోరుకున్నారు.
అనంతరం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ గారి ఆశీర్వచనాలు అందుకుని, బంజారా సమాజం సుఖసంతోషాలతో, ఐకమత్యంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జన్నారం మండలం బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు